జమ్ముకశ్మీర్‌ను తప్పక సందర్శిస్తా


Wed,August 14, 2019 01:30 AM

Rahul Gandhi accepts JandK Governor Satya Pal Malik challenge

-గవర్నర్‌ సత్యపాల్‌ ఆహ్వానంపై రాహుల్‌ స్పందన
న్యూఢిల్లీ, ఆగస్టు 13: జమ్ముకశ్మీర్‌ను సందర్శించాలన్న గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఆహ్వానంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ‘ప్రియమైన గవర్నర్‌ మాలిక్‌, మీ దయతోకూడిన ఆహ్వానాన్ని నాతో పాటు ప్రతిపక్ష బృందం స్వీకరిస్తున్నాం. జమ్ముకశ్మీర్‌తో పాటు లడఖ్‌ ప్రాంతాలను మేం సందర్శిస్తాం. మాకు మీ విమానం అవసరం లేదు. మేం స్వేచ్ఛగా వెళ్లి ప్రజలు, ముఖ్య నేతలతో పాటు అక్కడ మోహరించిన మన జవాన్లను కలిసేందుకు అనుమతిస్తే చాలు’ అని ట్వీట్‌ చేశారు. జమ్ము కశ్మీర్‌ విభజన, ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణల రద్దు నేపథ్యంలో జరుగుతున్న అల్లర్లలో ప్రజలు చనిపోతున్నారని, ప్రభుత్వం చెబుతున్నట్లు అక్కడి పరిస్థితి సాధారణంగా లేదని రాహుల్‌ శనివారం అన్నారు. గవర్నర్‌ దీనిపై సోమవారం స్పందిస్తూ రాహుల్‌కు విమానం పంపిస్తానని, ఇక్కడకు వచ్చి పరిస్థితిని కళ్లారా చూసి మాట్లాడాలని వ్యాఖ్యానించారు. దీనికి రాహుల్‌ మంగళవారం స్పందించారు.

209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles