రాహుల్ జోక్యం భరించలేకే బయటకు వెళ్లా


Mon,February 11, 2019 01:09 AM

Quit Congress UPA Due To Rahul Gandhis Interference

-కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ వెల్లడి
బెంగళూరు, ఫిబ్రవరి 10: పార్టీ వ్యవహారాల్లో రాహుల్ గాంధీ నిత్యం జోక్యం చేసుకోవడం భరించలేకే కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందని కర్ణాటక మాజీ సీఎం, ఎస్‌ఎం కృష్ణ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అప్పటికి పార్టీ అధ్యక్షుడు కాకున్నా, నిత్యం జోక్యం చేసుకునే వారని ఆదివారం తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కృష్ణ విదేశాంగశాఖ మంత్రిగా పని చేశారు. నేను మూడున్నరేండ్లు విదేశాంగశాఖ మంత్రిగా పని చేశా. రాహుల్ అప్పుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూడా కాదు. 80 ఏండ్లు దాటిన నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేసేవారు. అది నన్ను అసంతృప్తికి గురి చేయడం వల్లే కాంగ్రెస్‌కి రాజీనామా చేశా. ఏదైనా అంశంపై సందేహాలు ఉంటే మంత్రి దృష్టికి తీసుకురారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. కానీ రాహుల్ ఎక్కడో ఆర్డినెన్స్ ప్రతిని చించేశారు.రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు అని ఆయన ఆరోపించారు.2013లో ఏదైనా కేసులో దోషులుగా తేలిన వారిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టేందుకు కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది.

123
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles