మాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు


Sun,January 13, 2019 02:09 AM

puduchery-cm-v-narayanaswamy-and-lieutenant-governor-kiran-bedi-started-heated-debate-over-gift-on-pongal

-గవర్నర్ కిరణ్‌బేడీని హెచ్చరించిన పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి
-సంక్రాంతి గిఫ్టు ప్యాకెట్ల పథకంపై ఇరువురి మధ్య వివాదం

పుదుచ్చేరి: అసలే ఉప్పునిప్పుగా ఉన్న పుదుచ్చేరి సీఎం వీ నారాయణస్వామి, రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీల మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. తన ప్రభుత్వంతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించగా, హుందాగా మాట్లాడాలంటూ గవర్నర్ కిరణ్‌బేడీ చురకలంటించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పుదుచ్చేరి రాష్ట్ర ప్రజలకు ఉచితంగా గిఫ్టు ప్యాకెట్లు అందజేయాలని సర్కారు నిర్ణయించడమే ఈ వివాదానికి కారణం. మద్రాస్ హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఈ పథకానికి మోకాలడ్డుతున్నారని నారాయణస్వామి ఆరోపించారు. మరోవైపు సీఎం వ్యాఖ్యలను కిరణ్‌బేడీ కొట్టిపారేశారు. వ్యక్తిగతంగా తాను ఎవరికీ భయపడే రకం కాదని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా తమిళనాడు సర్కారు అక్కడి నిరుపేదలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిందని, కానీ మద్రాస్ హైకోర్టు దీన్ని అడ్డుకుందని ఆమె గుర్తుచేశారు. న్యాయస్థానం ఆదేశాలనే తాను పాటిస్తున్నానని చెప్పారు.

464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles