బీజేపీ ప్రచారానికి జాకీ ష్రాఫ్, అర్జున్ రాంపాల్Wed,January 11, 2017 12:46 AM

న్యూఢిల్లీ, జనవరి 10: యూపీ ఎన్నికల్లో బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, అర్జున్‌రాంపాల్ బీజేపీ తరఫున స్టార్ క్యాంపెయినర్లు కానున్నారు. మంగళవారం బీజేపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన అర్జున్ రాంపాల్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. మోడలింగ్ రంగం నుంచి వెండితెరపై అడుగుపెట్టిన రాంపాల్.. బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గియాను కలిశారు. అనంతరం ప్రధాని మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన చేస్తున్న పనులు తన ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, పార్టీతో కలిసి పని చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో రాంపాల్ ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయని విజయ్‌వర్గియా చెప్పారు. అర్జున్‌రాంపాల్ బీజేపీలో చేరుతారా? అన్న ప్రశ్నకు.. అవకాశం ఉందని సమాధానమిచ్చారు. ఇదే ప్రశ్నకు రాంపాల్ సమాధానమిస్తూ తానింకా నిర్ణయించుకోలేదని చెప్పారు.

397
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS