భారత సంతతి పాక్‌ నేత కుట్టి మృతి


Mon,August 26, 2019 01:43 AM

Prominent Indian origin Pakistani politician BM Kutty dies

కరాచీ, ఆగస్టు 25: భారత సంతతికి చెందిన ప్రముఖ పాకిస్థానీ రాజకీయ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త బీ ఎం కుట్టి మరణించారు. 89 ఏండ్ల ఈయన దీర్ఘకాల అనారోగ్యం కారణంగా కరాచీలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కుట్టీ పూర్తి పేరు భియ్యోతిల్‌ మొహియుద్దీన్‌ కుట్టీ. మలయాళీ ముస్లిం కుటుంబానికి చెందిన ఈయన 1930లో కేరళలోని తిరూర్‌ పట్టణంలో జన్మించారు. 1949లో 19 ఏండ్ల వయసులో కేరళ నుంచి పాకిస్థాన్‌కి వలస వెళ్లారు. ఈయన భార్య బిర్జిస్‌ సిద్దిఖీ 2010లో మరణించారు. వీరికి నలుగురు సంతానం. పౌర హక్కుల కోసం కుట్టీ అలుపెరుగని పోరాటం చేశారు. ఈయన మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ సంతాపం తెలిపారు.

185
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles