వారణాసిలో ప్రియాంక రోడ్ షో


Thu,May 16, 2019 01:28 AM

Priyankas Varanasi roadshow gathers crowds

- భారీ బల ప్రదర్శన చేసిన కాంగ్రెస్

వారణాసి: ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కాంగ్రెస్ పార్టీ భారీ బల ప్రదర్శన చేసింది. ఈ నెల 19న పోలింగ్ జరుగనున్న వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌తో కలిసి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ బుధవారం రోడ్ షో జరిపారు. బెనారస్ హిందూ వర్సిటీ గేట్ వద్ద మదన్ మోహన్ మాలవీయ విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రియాంకాగాంధీతోపాటు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘెల్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ షో మార్గంలో గుమిగూడిన అభిమానులు, సాధారణ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రియాంక ముందుకు సాగారు. రోడ్ షో పొడవునా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మోదీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇటీవల నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఒకరోజు ప్రధాని మోదీ రోడ్ షో జరిపిన 3 వారాలకు వారణాసిలో కాంగ్రెస్ పార్టీ తన బలం ప్రదర్శించింది. కాంగ్రెస్ రోడ్ షో కోసం భారీగా జన సమీకరణ జరిపింది. ప్రియాంకాగాంధీ రోడ్ షో దశ అశ్వమేధ్ ఘాట్ వద్ద ముగిసింది. తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయం, కొట్వాలీ ప్రాంతంలోని కాల భైరవ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు.

132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles