మా నేతల ప్రాణాలకు ప్రమాదం

Wed,December 4, 2019 03:04 AM

- ప్రియాంక ఇంట్లోకి చొరబాటు నేపథ్యంలో మోదీ, అమిత్‌షాపై కాంగ్రెస్‌ ధ్వజం
- మా ఇంట్లోకి కారు దూసుకురావడం భారీ భద్రతాలోపమే: రాబర్ట్‌ వాద్రా

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇంటిలోకి భద్రతా వలయాన్ని దాటుకొని ఏడుగురు వ్యక్తులు కారు లో దూసుకెళ్లిన ఘటనపై కాంగ్రెస్‌ మండిపడింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కలిసి తమ పార్టీ నేతల ప్రాణాల ను ప్రమాదంలోకి నెట్టారన్నది. ఆ పార్టీ ప్రధా న కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం ట్వీట్‌ చేస్తూ ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం కొందరి ప్రాణాలను ప్రమాదంలో పెట్టకూడదన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి పార్లమెంట్‌ బయట మాట్లాడుతూ గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భ ద్రత తొలిగింపుపై నిరసన చేపట్టాలనుకున్నా, సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. మరోవైపు ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా స్పందిస్తూ కారు తమ ఇంటిలోకి దూసుకురావడం భారీ భద్రతా లోపమేనన్నారు. ఎస్పీజీ భద్రత తొలిగింపు రాజకీయ ప్రేరేపిత చర్యగానే కనిపిస్తున్నదన్నారు.

474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles