ప్రియాంక ప్రభావం ఉండకపోవచ్చు!


Tue,February 12, 2019 02:31 AM

Priyanka Gandhi unlikely to make big impact Lok Sabha elections

-దీర్ఘకాలంలో మాత్రం ఆమె అద్భుత విజయాలు సాధిస్తారు
-జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌కిషోర్ వ్యాఖ్యలు

పాట్నా, ఫిబ్రవరి 11: మరికొద్ది రోజుల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ యువనేత ప్రియాంక గాంధీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్‌కిషోర్ అభిప్రాయపడ్డారు. ప్రియాంక లక్నో తొలి పర్యటనపై ఆయన స్పందిస్తూ.. ప్రియాంకకు అభినందనలు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో కాంగ్రెస్‌కు కచ్చితంగా మేలు చేకూరుతుంది. అయితే, అది భవిష్యత్తులో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే. మరో రెండు, మూడు నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక రాకతో పెద్ద మార్పులు సంభవిస్తాయని నేను భావించడం లేదు. అయితే, ఆమెకు ఉన్న పేరు ప్రతిష్ఠలు, ఛరిష్మాతో భవిష్యత్తులో అద్భుత విజయాలు సాధించగలరు. ఎన్డీయేకు కచ్చితంగా ఆమె సవాలుగా మారగలరు అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.

186
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles