సోదరి, సోదరుల్లారా..!


Fri,March 15, 2019 11:14 AM

Priyanka Gandhi on starting debut speech with my sisters

తొలి ప్రసంగంతోనే ప్రియాంక కొత్త ఒరవడి
న్యూఢిల్లీ: తన తొలి ప్రసంగంలోనే కాంగ్రెస్ తురుపుముక్క, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సరికొత్త ఒరవడి సృష్టించారు. ఇప్పటివరకూ నేతల ప్రసంగాలు సోదర, సోదరీమణుల్లారా (మేరీ బాయియో ఔర్ బహ నో) అనే వాక్యంతో ప్రారంభించడం మనం చూస్తున్నాం. కానీ, ఈ నెల 12న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో ప్రియాంక గాంధీ మాత్రం .. సోదరి, సోదరుల్లారా (మేరీ బహన్.. ఔర్ బాయియో) అని ప్రసంగాన్ని ప్రారంభించిన సంగతి మీడియా, రాజకీయ పార్టీలు గుర్తించలేదు. కానీ, అసోంలోని సిల్చార్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవ్ గుర్తించారు. ప్రియాంక ప్రసంగం వీడియో క్లిప్‌ను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గుజరాత్‌లో ప్రియాంక ప్రసంగం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇప్పటివరకూ ముందు పురుషుల్ని సంబోధించి, ఆ తర్వాత మహిళలను ప్రస్తావించేవారు.ప్రియాంక మాత్రం భిన్నంగా తొలుత స్త్రీలను సంబోధించారు అని ట్విట్టర్‌లో సుస్మితాదేవ్ పోస్టు చేశారు. దీనికి ప్రియాంక సమాధానమిస్తూ దీన్ని ఎవరూ గుర్తించలేదనుకున్నా.. అని రీట్వీట్ చేశారు

126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles