శివసేనలోకి ప్రియాంక చతుర్వేది


Sat,April 20, 2019 02:14 AM

Priyanka Chaturvedi quits Congress joins Shiv Sena

-కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మీడియా సెల్ కన్వీనర్ ప్రియాంక చతుర్వేది ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం శివసేన పార్టీలో చేరారు. ఇటీవల మథురలో తనను బెదిరింపులకు గురిచేసి, అసభ్యంగా ప్రవర్తించిన యూపీ కాంగ్రెస్ నేతలపై పార్టీ చర్యలు తీసుకున్నప్పటికీ.. మళ్లీ కొన్నిరోజులకే ఆ నాయకులను పార్టీలోకి తీసుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవులకు రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఇతర సీనియర్ నాయకులకు లేఖ రాశారు. కొన్ని వారాలుగా పార్టీలో తాను చేసే సేవలకు విలువనివ్వడంలేదని ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున తనకు మద్దతుగా నిలిచినవారికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళల భద్రత, గౌరవం, సాధికారత గురించి కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నప్పటికీ.. పార్టీ చేపడుతున్న చర్యల్లో అవేమీ కనిపించడంలేదని ఆమె విమర్శించారు. అనంతరం శివసేన అధ్యక్షుడు ఉద్ధ్దవ్ ఠాక్రే సమక్షంలో ఆమె ఆ పార్టీలో చేరారు.

168
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles