యోగాకు డుమ్మాకొట్టి అమ్మను కలిశా: మోదీWed,January 11, 2017 12:44 AM

న్యూఢిల్లీ: గుజరాత్ వైబ్రంట్ సమ్మిట్ సదస్సులో పాల్గొనేందుకు గుజరాత్ వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ఉదయం యోగాకు డుమ్మాకొట్టి గాంధీనగర్‌లో ఉన్న తన తల్లి హీరాబెన్(95)ను కలుసుకున్నారు. అనంతరం ఆమెతో అల్పాహారం(బ్రేక్‌ఫాస్ట్) తీసుకుని కొద్దిసేపు ముచ్చటించారు. తాను తల్లిని కలుసుకున్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తల్లిని కలుసుకున్న విషయాన్ని మోదీ స్వార్థప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్‌లోవిమర్శలు గుప్పించారు. తల్లిని కలుసుకోవడం కూడా ప్రధాని రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని తల్లి హీరాబెన్‌ను ఆయన ఎప్పుడో ఒక్కసారి కలుసుకుంటారు. కానీ, తన తల్లి తనతోనే ఉంటుందని, ప్రతిరోజు ఆమెను కలుసుకుని దీవెనలు తీసుకుంటానని కేజ్రీవాల్ చెప్పారు. ప్రధాని లాగా తల్లిని కలిసే విషయాన్ని కూడా ప్రపంచానికి చెప్పాల్సిన పనిలేదని సూచించారు. హిందూ మత గ్రంథాల ప్రకారం తల్లి, భార్యను తనతోనే ఉండనివ్వాలని హితబోధ చేశారు. గత నవంబర్‌లో పెద్దనోట్ల రద్దు సందర్భంగా మోదీ తల్లి హీరాబెన్‌ను వీల్‌చైర్‌లో బ్యాంకుకు తీసుకువెళ్లిన నోట్ల మార్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. తల్లి హీరాబెన్‌ను మోదీ స్వార్థప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. మోదీ ఇల్లు చాలా పెద్దది అని..తల్లిని కూడా తనతోనే ఉంచుకోనేలా చూసుకోవచ్చుగా అని ట్విటర్‌లో హితబోద చేశారు.

533
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS