గామాలను నాశనం చేస్తున్న కులతత్వంThu,October 12, 2017 01:45 AM

ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన
Narendra-Modi
న్యూఢిల్లీ:గ్రామాలను కులతత్వం నాశనం చేస్తున్నదని, దానిని అధిగమించేందుకు అందరూ ప్రయత్నించాల్సిన అవసరముందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. గ్రామీణాభివృద్ధి విషయంలో ఫలితాల ఆధారిత విధానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. సంఘసంస్కర్త నానాజీ దేశ్‌ముఖ్ శత జయంతి, సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ 115వ జయంతి సందర్భంగా ఢిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిట్టచివరి వ్యక్తికీ లబ్ధి చేకూర్చేలా దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నాయని, గుడ్ గవర్నెన్స్ ద్వారానే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని పేర్కొన్నారు. విధానాలు.. ఫలితాల ఆధారంగా ఉండాలే కాని ఉత్పత్తి ఆధారంగా కాదని తెలిపారు. పట్టణాల్లో పెరిగే పిల్లల తరహాలో గ్రామీణ చిన్నారి కూడా అన్ని అవకాశాలను పొందినప్పుడే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సార్థకత చేకూరుతుందని స్పష్టంచేశారు.

234

More News

VIRAL NEWS