కశ్మీరీలపై దాడులు నిరోధించండి


Sat,February 23, 2019 02:28 AM

Prevent Kashmiris Boycott Attacks Top Court To States After Pulwama

- వారి రక్షణకు సత్వరమే చర్యలు తీసుకోండి
- 11 రాష్ర్టాల సీఎస్‌లు, డీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూడిల్లీ/శ్రీనగర్, ఫిబ్రవరి 22: పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా కశ్మీరీలపై దాడులు జరుగుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. కశ్మీరీలు, కశ్మీరీ విద్యార్థులను బెదిరించడం, దౌర్జన్యానికి పాల్పడడం వంటి ఘటనలు చోటుచేసుకోకుండా నిరోధించాలని సూచించింది. ఇందుకు అనువైన చర్యలు తీసుకోవాలంటూ 11 రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు శుక్రవారం చీఫ్ జస్టిస్ రంజన్‌గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. మూక దాడులను నిరోధించేందుకు గతంలో నోడల్ అధికారులుగా నియమితులైన పోలీసులు, ప్రస్తుతం కశ్మీరీలపై దాడుల కేసుల బాధ్యతను చేపట్టాలని ధర్మాసనం సూచించింది. ఈ మేరకు మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, జమ్ముకశ్మీర్, హర్యానా, మేఘాలయ, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లతోపాటు ఢిల్లీ పోలీస్ కమీషనర్‌కు ఆదేశాలిచ్చింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం కశ్మీరీలపై దాడులు చేస్తున్నారని, వారికి రక్షణ కల్పించాలని కోరుతూ న్యాయవాది తారిక్ అదీబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం పై ఆదేశాలిచ్చింది.

317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles