అంబేద్కర్‌కు ఘన నివాళిThu,December 7, 2017 02:17 AM

RamNathKovind
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా బుధవారం పార్లమెంట్ హౌస్ ఆవరణలోని బాబాసాహెబ్ చిత్రపటానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘనంగా నివాళులర్పించారు. దళితుల ఉన్నతికి అంబేద్కర్ ఎంతగానో కృషిచేశారని పలువురు నేతలు కొనియాడారు. కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, వివిధ పార్టీల నేతలు కూడా పుష్పగుచ్చాలు సమర్పించి నివాళి అర్పించారు. కాగా, బీఆర్ అంబేద్కర్ పేరిట ఢిల్లీలో నెలకొల్పిన అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రధాని మోదీ గురువారం ప్రారంభిస్తారు.

140

More News

VIRAL NEWS