కేంద్రరాష్ర్టాల మధ్య వారధిగా నిలువాలి


Fri,October 13, 2017 02:29 AM

President Kovind says Governors to have key role in New India dream

-గవర్నర్ల మహాసభలో రాష్ట్రపతి కోవింద్ ఉద్బోధ
- ప్రజల్లో నవభారత స్ఫూర్తిని నింపాలని పిలుపు
- ఎమ్మెల్యేలను రాజ్‌భవన్‌కు పిలిచి ప్రజా సమస్యలు చర్చించాలని సూచన
- రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు ప్రారంభం
President
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: శాసనసభ్యులతో ప్రజాసంక్షేమానికి సంబంధించిన అంశాలను గవర్నర్లు చర్చించాలని, తద్వారా అభివృద్ధికి కొత్తపార్శం తోడవుతుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. గురువారం రాష్ట్రపతిభవన్‌లో జరిగిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ తదితరులు హాజరయ్యారు. అవినీతి, పేదరికం, నిరక్షరాస్యత, పోషకాహార లోపం, అపరిశుభ్రత లేని నవభారతం కోసం తమతమ రాష్ర్టాల ప్రజలకు గవర్నర్లు స్ఫూర్తిని నింపాలని రాష్ట్రపతి తన ప్రారంభోపన్యాసంలో పిలుపునిచ్చారు. శాసనసభ్యులతో సంప్రదింపులు జరుపాలని, రాజ్‌భవన్‌లకు వారిని ఆహ్వానించాలని ఆయన సూచించారు. కేంద్రానికి, రాష్ర్టానికి మధ్య గవర్నర్లు వారధిలా పనిచేయాలని అన్నారు. పౌరులపై ప్రభుత్వాలు విశ్వాసం ఉంచాలని, గుర్తింపు పత్రాలకు స్వీయధ్రువీకరణను అనుమతించాలని ఆయన చెప్పారు. పాస్‌పోర్టు పొందే విధానాన్ని సరళతరం చేయాలని అన్నారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, మేధావులతో గవర్నర్లు సంప్రదింపులు జరిపితే ప్రజాచర్చ పరిపుష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రధాని మోదీ మాట్లాడుతూ సమాజంలో మార్పులకు గవర్నర్లు చోదకులుగా మారాలని పిలుపునిచ్చారు. 2022 సంవత్సరానికి నిర్ణయించుకున్న నవభారత లక్ష్యాల పరిపూర్తికి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని సూచించారు.

194

More News

VIRAL NEWS

Featured Articles