ఫరూక్ అబ్దుల్లాను కోర్టు ముందు హాజరుపర్చండి


Thu,September 12, 2019 02:15 AM

Present Farooq Abdullah before court MDMK chief Vaiko files habeas corpus plea in SC

- సుప్రీంకోర్టులో వైగో పిటిషన్

న్యూఢిల్లీ: నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాను కోర్టు ముందు హాజరుపరిచేలా కేంద్రాన్ని, జమ్ముకశ్మీర్ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఎండీఎంకే వ్యవస్థాపకుడు, ఎంపీ వైగో సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు మాజీ సీఎం అన్నాదురై జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15న చెన్నైలో శాంతియుత, ప్రజాస్వామ్య వార్షిక సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలో పాల్గొనడానికి ఫరూక్ అబ్దుల్లాను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లాంటి మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కును కేంద్రం కాలరాస్తున్నది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నది. ఫరూక్‌అబ్దుల్లాను గృహనిర్బంధంలో ఉంచ డం అక్రమం. ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా కేంద్రాన్ని, జమ్ముకశ్మీర్ అధికారులను ఆదేశించండి అని వైగో పిటిషన్‌లో కోరారు.

137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles