ప్రధాని ముఖ్యకార్యదర్శిగా మిశ్రా


Thu,September 12, 2019 02:14 AM

Pramod Kumar Mishra is new principal secretary to PM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ప్రధానమంత్రి మోదీ నూతన ముఖ్యకార్యదర్శిగా ప్రమోద్‌కుమార్ మిశ్రా నియమితులైనట్టు ప్రధా ని కార్యాలయం అధికారంగా ప్రకటించింది. బుధవారమే ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు మిశ్రా.. ప్రధానికి అదనపు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం మిశ్రాకు.. క్యాబినెట్ మంత్రి హోదా లభించనుంది. ఇటీవలి వరకు పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నృపేంద్రమిశ్రా పనిచేశారు. మరోవైపు ప్రధాని ముఖ్యసలహాదారుగా క్యాబినెట్ మాజీ సెక్రటరీ పీకే సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. పీకే సిన్హా నియామకానికి క్యాబినెట్ నియామక మండలి ఆమోదం తెలిపింది. పీఎంవో ఓఎస్డీగా గతనెలలో సిన్హా నియమితులయ్యారు.

111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles