కశ్మీర్‌లో సెల్‌ఫోన్ సేవలు

Sun,October 13, 2019 02:29 AM

-రేపటినుంచి 40 లక్షల పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ల పునరుద్ధరణ
శ్రీనగర్, అక్టోబర్ 12: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో 69 రోజులుగా కొనసాగుతున్న ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కశ్మీర్‌లోని దాదాపు 40 లక్షల పోస్ట్‌పెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరించనున్నట్టు అధికారయంత్రాంగం ప్రకటించింది. జమ్ముకశ్మీర్ ప్రత్యేక కార్యదర్శి, అధికార ప్రతినిధి రోహిత్ కన్సల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పోస్ట్‌పెయిడ్ మొబైల్ సేవలను శనివారమే పునరుద్ధరించాలని భావించినప్పటికీ, చివరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల వీలుకాలేదని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.


కశ్మీర్‌లోని పది జిల్లాల్లో ఈ నిర్ణయం అమలవుతుందని తెలిపారు. ఇంటర్నెట్ సేవలను పొందేందుకు వినియోగదారులు ఇంకొంతకాలం వేచిఉండక తప్పదని స్పష్టంచేశారు. రెండ్రోజుల కిందటే పర్యాటకులను సైతం అనుమతించిన యంత్రాంగం.. ఇప్పటికే విద్యాసంస్థలను పునఃప్రారంభించింది. శాంతిని నెలకొల్పేందుకు సహకరించిన రాష్ట్ర ప్రజలకు కన్సల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 99 శాతం ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షల్లేవని వివరించారు. కశ్మీర్‌లోయలోని 50 వేల ల్యాండ్‌లైన్ ఫోన్ సేవలను ఇప్పటికే పునరుద్ధరించిన విషయం తెలిసిందే.

191
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles