కార్యకర్తల విరాళాలతో పార్టీని నడుపాలి: అమిత్ షా

Tue,February 12, 2019 12:28 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: పార్టీ కార్యకర్తల విరాళాలతోనే బీజేపీని నడుపాల్సి ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. నగదు మూటలు, రియల్టర్లు, కాంట్రాక్టర్ల నల్లధనం పై ఆధారపడి పార్టీని నడుపుతూ లక్ష్యానికి చేరుకోవాలని భావిస్తే విమర్శల పాలవ్వాల్సి వస్తుందన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ 51వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఢిల్లీలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. కార్యకర్తలు తమ సంపాదనలో ఒక భాగం పార్టీకి విరాళంగా ఇవ్వాలని కోరారు. ప్రతి బూత్ నుంచి రూ.1000 చొప్పున ప్రధాని నరేంద్రమోదీ యాప్ ద్వారా గానీ, చెక్కుల ద్వారా గానీ విరాళాలు సమకూర్చాలన్నారు. ఎన్నికల వ్యయం తగ్గింపునకు బహిరంగ చర్చ జరుగాలని పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తల విరాళాలతోనే సంస్థాగత, ఎన్నికల వ్యయాలకు నిధులు సమకూర్చగలమని బీజేపీ చెప్పడం లేదని, ఈనాడు అది సాధ్యం కూడా కాదన్నారు.

251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles