గాలి జనార్దనరెడ్డిపై లుకౌట్ నోటీస్


Fri,November 9, 2018 01:32 AM

Police on look out for absconding Janardhan Reddy in a ponzi scheme

బెంగళూరు: గనుల అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి మరో కేసులో చిక్కుకున్నారు. ఒక పొంజీ స్కీమ్ కేసులో ఆయనపై కర్ణాటక పోలీసులు లుకౌట్ నోటీసు జారీచేశారు. ఆయన సన్నిహితుడు అలీఖాన్ కోసమూ పోలీసులు గాలిస్తున్నారు. అంబిడెంట్ అనే సంస్థను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు నుంచి కాపా డేందుకు జనార్దనరెడ్డి ముందుకు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిజానిజాలు తెలుసుకునేందుకు జనార్దన రెడ్డిని ప్రశ్నించాల్సి ఉన్నదని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ టీ సునీల్ కుమార్ చెప్పారు. ఆయన పరారీలో ఉన్నాడన్నారు.

412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles