వామ్మో.. న్యుమోనియా

Thu,November 14, 2019 04:01 AM

-ఈ వ్యాధితో భారత్‌లో గంటకు 14 మంది చిన్నారులు మృతి
-వెల్లడించిన సేవ్ చిల్డ్రన్, యూనిసెఫ్

న్యూఢిల్లీ: న్యుమోనియా వ్యాధి చిన్న పిల్లల పాలిట శాపంగా మారింది. 2018లో ఈ వ్యాధితో భారత్‌లో ప్రతి గంటకు 14 మందికిపైగా చిన్నారులు మరణించారు. అంతేగాక
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ న్యుమోనియా మరణాలు సంభవిస్తున్న ఐదు దేశాల్లో భారత్ కూడా ఉండటం గమనార్హం. న్యుమోనియా మరణాలపై ఫైటింగ్ ఫర్ బ్రీత్ ఇన్ ఇండియా పేరుతో సేవ్ చిల్డ్రన్, యూనిసెఫ్, ఎవ్రీ బ్రీత్ కౌంట్స్ అనే సంస్థలు పరిశోధన చేపట్టాయి. ఈ వ్యాధితో 2018లో భారత్‌లో 1,27,000 మంది చిన్నారులు (0 నుంచి 5 ఏండ్లలోపు వయసున్న పిల్లలు) మరణించినట్లు పరిశోధనలో తేలింది.

ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియాతో మరణించిన చిన్నారుల్లో దాదాపు సగానికిపైగా మరణాలు నైజీరియా (1,62,000 మంది), భారత్ (1,27,000), పాకిస్థాన్ (58,000), డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (40,000), ఇథియోపియా (32,000)లోనే సంభవించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి యేటా ఈ వ్యాధితో 8 లక్షలకుపైగా చిన్నారులు మరణిస్తున్నారు. అంటే సగటున రోజుకు రెండువేలకుపైగా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నట్లు అర్థమవుతున్నది. యూనిసెఫ్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్‌రైటా స్పందిస్తూ న్యుమోనియా నిర్మూలనకు ప్రపంచదేశాలు కృషి చేయాలని, వైద్య రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచించారు.

2855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles