ఆర్బీఐ కాదు.. అన్ని నిర్ణయాలు మోదీవేWed,January 11, 2017 01:54 AM

నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్
న్యూఢిల్లీ: ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదీ నిర్ణయించే పరిస్థితుల్లో లేదని, అన్ని నిర్ణయాలూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే తీసుకుంటున్నారని నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ పేర్కొన్నారు. ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్బీఐ స్వయంప్రతిపత్తిపై ఆయన పలు ప్రశ్నలను లేవనెత్తారు. నోట్ల రద్దు నిర్ణయం నల్లద్రవ్యాన్ని నియంత్రించడంలో విఫలమైంది.
Amartya-Sen
నల్లధనాన్ని అరికట్టడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏమో చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. దీని నుంచి ప్రధాని లబ్ధి పొందుతూనే ఉంటారు. ధనికులు ఇబ్బందులు పడుతున్నారనే భావన పేదలకు నచ్చుతుంది. రద్దయిన నోట్లను డిసెంబర్ 30 తర్వాత మార్చుకోకుండా ఆర్బీఐ నిషేధం విధించింది అని నేను భావించడం లేదు. ఇది కచ్చితంగా ప్రధాన మంత్రి నిర్ణయమే. ప్రస్తుతం ఏదైనా నిర్ణయించే పరిస్థితుల్లో ఆర్బీఐ ఉందని నేను అనుకోవడం లేదు. రఘురాం రాజన్ గవర్నర్‌గా వ్యవహరించినప్పుడు ఆర్బీఐ సర్వ స్వతంత్రంగా వ్యవహరించింది. ప్రఖ్యాతిగాంచిన ఐజీ పటేల్, మన్మోహన్‌సింగ్ వంటి వారు సేవలందించారు. కేవలం 6శాతం ఉన్న నల్లద్రవ్యాన్ని అరికట్టడానికి చలామణిలోని 86శాతం నగదును ఉపసంహరించడం వింతగా ఉంది. అమెరికా, జపాన్‌తోపాటు చాలా దేశాల్లో నగదుతో కూడిన లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నోట్ల రద్దు ద్వారా దొంగనోట్లను నియంత్రించవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటుంది. భారత్‌లో దొంగనోట్లు ఎప్పుడూ పెద్ద సమస్య కాదు. భారతదేశం ఓ సమాఖ్య వ్యవస్థ. నోట్ల రద్దుపై పిడికెడు మంది కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను కూడా సంప్రదించి ఉండాల్సి ఉంది అని పేర్కొన్నారు.

413
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS