మోదీ సోదరుడి కుమార్తె పర్సు దోపిడీ

Sun,October 13, 2019 02:56 AM

50 వేల నగదు, రెండు ఫోన్లు, విలువైన పత్రాలు చోరీ.. ఢిల్లీలో ఘటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కుమార్తె పర్సును దొంగలు దోచుకున్నారు. పర్సులో రూ.50 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, విలువైన పత్రాలున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఈ ఘటన జరిగింది. అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి రైలులో వచ్చిన దమయంతి బెన్ మోదీ, ఉదయం 7 గంటలకు రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో గుజరాత్ సమాజ్ భవన్‌కు చేరుకున్నారు. ఆమె ఆటో దిగగానే స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు చేతిలోని పర్సును లాక్కొని పారిపోయారు. ఢిల్లీ లెఫ్ట్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసాలకు కూతవేటు దూరంలోని సివిల్ లైన్స్‌లో ఈ దొంగతనం జరిగింది. చోరీపై దమయంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం విమానంలో తాను గుజరాత్‌కు వెళ్లాల్సి ఉన్నదని, ఇంతలో ఈ ఘటన జరిగిందని ఆమె పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించామని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని నార్త్ డీసీపీ మౌనిక భరద్వాజ్ తెలిపారు. ఢిల్లీలో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయని ఆమ్‌ఆద్మీ పార్టీ విమర్శించింది. ఢిల్లీలో శాంతిభద్రతలు కేంద్రం పరిధిలో ఉంటాయి.

456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles