వాన నీటిని ఒడిసి పట్టండి


Sun,June 16, 2019 02:32 AM

PM Modis Hand Delivered Letters To Village Heads A Hit What He Wrote

- నీరు వృథా కాకుండా చర్యలు చేపట్టండి
- సర్పంచులకు ప్రధాని మోదీ లేఖలు


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గ్రామాల సర్పంచ్‌లకు లేఖలురాశారు. వానాకాలం సమీపించడంతో వర్షం నీటిని ఒడిసి పట్టాలని సూచించారు. వర్షం నీరు వృథా కా కుండా చర్యలు చేపట్టి గ్రామాల్లో నీటి సమస్యను నివారించాలని కోరారు. జిల్లా కలెక్టర్ల ద్వారా ఈ లేఖలు ఆయా గ్రామ సర్పం చ్‌లకు చేరాయి. మోదీ స్థానమైన వారణాసి పరిధిలోని 637 మంది సర్పంచ్‌లకు ఈ లేఖలు అందినట్లు తెలుస్తున్నది. ప్రధాని మోదీ ఈ లేఖలను హిందీలో రాశారు. ప్రియమైన సర్పంచ్ గారికి, నమస్కారం. పంచాయతీలోని సోదర, సోదరీమణులు ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరికొన్ని రోజుల్లో వానాకాలం ప్రారంభంకానుంది. మనకు సరిపడా నీరిచ్చిన దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. వాన నీరు వృథా కాకుండా తగిన చర్యలు చేపట్టాలి. గ్రామ సభలు జరిపి ప్రజలకు నా సందేశాన్ని వినిపించండి. వర్షం నీటిని ఎలా సంరక్షించాలి అన్న దానిపై అంతా చర్చించండి అని పేర్కొన్నారు. ప్రతి వర్షపు నీటిబొట్టు ఒడిసి పట్టేందుకు తగిన చర్యలు చేపడతారన్న నమ్మకం ఉందన్నారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణం, చెరువులు, ఇంకుడు గుంతలు తవ్వకంతో వర్షం నీటిని సంరక్షించుకోవచ్చని సర్పంచులకు మోదీ సూచించారు.

162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles