8న కర్తార్‌పూర్‌ను ప్రారంభించనున్న మోదీ

Sun,October 13, 2019 02:19 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రధాని మోదీ వచ్చేనెల 8న ప్రారంభించనున్నారని కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ చెప్పారు. ఈ మేరకు ఆమె శనివారం ట్వీట్ చేస్తూ గురునానక్ దేవ్ జీ ఆశీస్సులతో ఎట్టకేలకు కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం కానుంది. దీనిని వచ్చే నెల 8న ప్రధాని మోదీ ప్రారంభించడంతో కొత్త చరిత్ర నమోదవుతుంది అని పేర్కొన్నారు. కారిడార్‌ను ప్రారంభించిన అనంతరం సుల్తాన్‌పూర్ లోధి వద్ద ప్రధాని మోదీ ప్రార్థనలు చేయనున్నారని చెప్పారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ మందిరాన్ని పాకిస్థాన్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలుపుతూ కర్తార్‌పూర్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles