జనం మిమ్మల్ని క్షమించరు


Sat,March 23, 2019 02:33 AM

PM Modi takes on Sam Pitroda in Twitter war over Pulwama

-ఉగ్రవాదులను ఉపేక్షించి సాయుధ బలగాలను ప్రశ్నించే వారి నిలయంగా ప్రతిపక్షాలు మారాయి
-నిప్పులు చెరిగిన మోదీ
న్యూఢిల్లీ, మార్చి 22: కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు మిమ్మల్ని క్షమించరు (జనతా మాఫ్ నహీ కరేగీ) అని శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ఉగ్రవాద శక్తులకు జవాబివ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ఇప్పటికే దేశమంతటికీ తెలిసిన విషయాన్ని కాంగ్రెస్ రాజకుటుంబ విధేయుడు అంగీకరిస్తున్నారు. కానీ, ఇది నవ భారత దేశం. ఉగ్రవాదులకు అర్థమయ్యే భాషలోనే వారికి మేము జవాబిస్తాం అని మోదీ స్పష్టం చేశారు. అడ్డగోలు ప్రకటనలు చేస్తున్న విపక్ష నేతలను నిలదీయాలని, వారి ఆకతాయి చేష్టలను క్షమించబోమని స్పష్టం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత విధేయుడైన శామ్ పిట్రోడా భారత సాయుధ బలగాలను అవమానించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున పాకిస్థాన్ జాతీయ దినోత్సవాలను ప్రారంభించారని మోదీ విమర్శించారు. పుల్వామా దాడిని ఓట్ల కోసం చేసిన కుట్రగా ఆరోపించిన సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్‌పై మోదీ నిప్పులు చెరిగారు. ఇది గర్హనీయమైన ప్రకటన అని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఆయన మన అమర వీరుల కుటుంబాలను అవమానించారు అని ధ్వజమెత్తారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ట్విట్టర్ ద్వారా విపక్షాలపై విమర్శలు గుప్పించారు. విపక్షాలకు, బీజేపీకి ఎంతో తేడా ఉన్నది. వారు మన సాయుధ బలగాలను శంకిస్తుంటే.. ఆర్మీని చూసి మనం గర్వపడుతున్నాం. వారి గుండె ఉగ్రవాదుల కోసం కొట్టుకుంటుంటే.. మన గుండె త్రివర్ణ పతాకం కోసం కొట్టుకుంటున్నది అని పేర్కొన్నారు.

171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles