రాజీవ్‌కు జాతి నివాళి


Wed,May 22, 2019 01:27 AM

PM Modi pays tribute to Rajiv Gandhi on 28th death anniversary

- రాహుల్ భావోద్వేగ సందేశం
- మీరే మా హీరో: ప్రియాంక
- ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ నివాళి


న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా ఆయన కు జాతి మంగళవారం నివాళులర్పించిం ది. ఢిల్లీలోని వీర్‌భూమి వద్ద గల రాజీవ్ స్మారక చిహ్నం వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోని యాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించా రు. ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా రాజీవ్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో భావోద్వేగ పూరిత సందేశాన్ని పోస్టుచేశారు.

నా తండ్రి సౌమ్యుడు, ప్రేమకు, దయాగుణానికి, ఆప్యాయతకు పెట్టింది పేరు. ప్రతి అంశాన్ని ప్రేమించాలని, గౌరవించాలని నాకు బోధించారు. ఎప్పుడూ ద్వేషం ప్రదర్శించొద్దని చెప్పారు. క్షమించాలని సూచించారు. ఆయనను కోల్పోయాను. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రేమ, కృతజ్ఞతలతో నా తండ్రిని స్మరించుకుంటాను అని ట్వీట్ చేశారు. ప్రియాంకాగాంధీ సైతం మీరు ఎల్లవేళలా నా హీరోనే అని ట్వీట్ చేశారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతోపాటు ఇతర పార్టీల నేతలు సైతం రాజీవ్‌గాంధీకి నివాళులు అర్పించారు.

163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles