పౌరసత్వ బిల్లుతో హాని జరుగదు


Sun,February 10, 2019 02:47 AM

PM Modi faces black flags, protests on Assam visit

-రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసుల అనంతరమే పౌరసత్వం
-ఈశాన్య ప్రాంత ప్రజలకు ప్రధాని మోదీ భరోసా
-అసోం, త్రిపుర, అరుణాచల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
-పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ నగ్న ప్రదర్శన చేపట్టిన నిరసనకారులు

చంగ్‌సరీ (అసోం)/ ఇటానగర్, అగర్తల ఫిబ్రవరి 9: పౌరసత్వ బిల్లు వల్ల అసోంతోపాటు ఈశాన్య రాష్ర్టాలకు ఎలాంటి హానీ జరుగబోదని ప్రధాని నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత్ బిశ్వ శర్మకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. అసోం, ఈశాన్య రాష్ర్టాల భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఆకాంక్షల పరిరక్షణకు ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసుల అనంతరమే పౌరసత్వం కల్పిస్తామని స్పష్టం చేశారు. అక్రమంగా దేశంలో చొరబడినవారికి, తమ విశ్వాసాల కారణంగా ప్రాణ రక్షణ కోసం దేశం వదిలి పారిపోయి వచ్చిన వారికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలన్నారు. పొరుగుదేశాల్లో దారుణాలకు గురై భారత్‌ను శరణుకోరిన మైనార్టీలకు ఆశ్రయం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అంతకుముందు ఆయన చంగ్‌సరీలో ఎయిమ్స్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే బ్రహ్మపుత్ర నదిపై ఆరు లేన్ల వంతెనకు శంకుస్థాపన చేశారు. అనంతరం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించిన ఆయన సుమారు రూ.4 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హొల్లంగి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే డీడీ అరుణ్ ప్రభ చానల్‌ను ప్రారంభించారు. అనంతరం త్రిపుర రాజధాని అగర్తలలో మాట్లాడుతూ.. విపక్షాల మహా కల్తీ కూటమికి తనను హేళన చేయడమే ప్రధాన పని అని, ఇందులో కూటమి నేతలందరూ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నట్లు ఉందన్నారు.

923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles