బీచ్‌లో చెత్త ఏరిన మోదీ

Sun,October 13, 2019 02:40 AM

మామల్లాపురం, అక్టోబర్ 12: జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర సదస్సు కోసం మామల్లాపురానికి వచ్చిన ప్రధాని మోదీ.. శనివారం ఉదయం స్థానిక బీచ్‌లో జాగింగ్ చేస్తూ అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, బాటిళ్లు, ఇతర చెత్తాచెదారాన్ని తొలిగించారు. జాగింగ్ చేస్తూ చెత్తను ఏరడాన్ని ప్లాగింగ్ అంటారు. దాదాపు అరగంట పాటు ప్రధాని ఆ బీచ్‌ను శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మామల్లాపురం బీచ్‌లో ఈ రోజు ఉదయం సుమారు 30 నిమిషాల పాటు ప్లాగింగ్ చేశా. నేను ఏరిన చెత్తను హోటల్ సిబ్బందికి అందజేశా. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుదాం. అలాగే మనం కూడా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉందాం అని ప్రధాని పేర్కొన్నారు.


506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles