మేం దేశాన్ని విభజించాలనుకుంటే..ఇండియా ఉండేదే కాదు


Tue,April 16, 2019 11:14 AM

PM Modi Amit Shah biggest enemies of people Farooq Abdullah

-నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్య
-మోదీ విమర్శలకు స్పందన
శ్రీనగర్, ఏప్రిల్ 15: అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తిప్పికొట్టారు. మా కుటుంబం దేశాన్ని విభజించాలని అనుకుని ఉంటే.. ఇండియా ఉండేదే కాదు అని వ్యాఖ్యానించారు. సోమవారం శ్రీనగర్‌లో కార్మికులు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీనే దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్నారని, అయితే ఆయన ప్రయత్నాలు సఫలం కాబోవన్నారు.

అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం మా పార్టీ పోరాటం చేస్తుంది. అది ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ.. మా పోరాటం కొనసాగిస్తాం. మోదీ విశ్వ ప్రయత్నాలు చేసినా.. ఇండియాను విభజించలేరు. అబ్దుల్లా కుటుంబం దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నదని మీరు ఆరోపిస్తున్నారు. మేం ఇండియాను విభజించాలనుకుని ఉంటే.. ఇండియా ఉండేదే కాదు అని ఫరూఖ్ వ్యాఖ్యానించారు. 1996లో రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో దేశం జెండా పట్టుకున్న వ్యక్తిని తానేనన్న విషయాన్ని మోదీ గుర్తుపెట్టుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు రాష్ర్టాన్ని సర్వనాశనం చేశాయని, వారు దేశాన్ని విభజిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు.

536
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles