నిర్భయ దోషులను ఉరితీస్తా!

Thu,December 5, 2019 02:10 AM

-రాష్ట్రపతికి లేఖ రాసిన వ్యక్తి

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులను ఉరితీయడానికి తనను తాత్కాలిక తలారీగా నియమించాలని కోరుతూ హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశా రు. దోషులను ఉరితీయడానికి తీహార్ జైలు అధికారులు సన్నద్ధమవుతున్నారని, తలారీ లేడనే విషయాన్ని రవికుమార్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. తనను తాత్కాలిక తలారీగా నియమించాలని రాష్ట్రపతిని కోరా రు. దోషులను ఉరితీయడం వల్ల నిర్భయ ఆత్మకు శాంతి కలుగుతుందని పేర్కొన్నారు. భారత్‌లో అరుదుగా ఉరితీస్తుండటంతో తలారీలను నియమించడం లేదు.

1227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles