సివిల్స్‌కు ఎంపికైనట్టు నమ్మించి కటకటాల పాలు


Tue,April 16, 2019 12:56 AM

person who believes that he has been selected for the civil

లక్నో, ఏప్రిల్ 15: సివిల్స్‌కు ఎంపికయ్యానని నమ్మించిన వ్యక్తి కటకటాల పాలైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హపూర్‌లో జరిగింది. సిద్ధార్థ్ గౌతమ్ హపూర్‌లో కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. సివిల్స్‌లో తన పేరే ఉన్న మరో వ్యక్తికి 532 వ ర్యాంక్ వచ్చింది. దీంతో ఓ నకిలీ కేటాయింపు లెటర్ తయారుచేసి తాను సివిల్స్‌కు ఎంపికయ్యానని నమ్మించా డు. అంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పత్రికల్లో ఆయన ఇం టర్వ్యూ రావడంతో 532 ర్యాంక్ పొం దిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆదివారం నకిలీ సిద్ధార్థ్‌ను అరెస్ట్‌చేశా రు. దీంతో అతడి తండ్రికి గుండెపోటు వచ్చింది. సివిల్స్ ర్యాంకర్ సిద్ధార్థ్.. ఇండియన్ రైల్వే అక్కౌంట్స్ సర్వీస్ (ఐఆర్‌ఏఎస్)లో పని చేస్తున్నారు.

103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles