వందే భారత్‌పై విమర్శలా?

Wed,February 20, 2019 02:24 AM

-ఆ ప్రాజెక్టు ఇంజినీర్లను అవమానిస్తున్నారు
-పరోక్షంగా రాహుల్, అఖిలేశ్‌పై ప్రధాని మోదీ ధ్వజం

వారణాసి, ఫిబ్రవరి 19: మన దేశానికి చెందిన తొలి హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్న విపక్ష నాయకులపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారణాసి-ఢిల్లీ మధ్య ఇటీవల ప్రారంభమైన ఈ రైలులో సాంకేతిక సమస్య తలెత్తడాన్ని ఎద్దేవా చేయడం ద్వారా ఆ ప్రాజెక్టు ఇంజినీర్లను విపక్ష నాయకులు అవమానిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌పై ప్రధాని పరోక్షంగా నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన యూపీలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో రూ.3 వేలకోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు రెండు సభల్లో ప్రసంగించారు. వారణాసిలో మోదీ పర్యటించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కొంత మంది వ్యక్తులు వందే భారత్ ఎక్స్‌పెస్‌ప్రై విమర్శలు గుపిస్తున్నారు. తద్వారా ఈ ప్రాజెక్టు ఇంజినీర్లను, దేశాన్ని అవమానిస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్ముందు మన దేశంలో బుల్లెట్ రైలును తయారుచేసి దానిని నడపబోతున్న ఇంజినీర్లకు నేను శాల్యూట్ చేస్తున్నా. ఇటువంటి ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను అవమానించడం సబబేనా? సరైన సమయంలో వారిని తగిన విధంగా శిక్షించవద్దా? అని ప్రశ్నించారు.

688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles