గాంధీజీ ఆత్మనే చంపేస్తున్న ప్రజ్ఞాసింగ్


Sun,May 19, 2019 02:23 AM

People like Pragya killing soul of India says Kailash Satyarthi

-నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి నిరసన
-రాజకీయాలు, అధికారానికి గాంధీజీ అతీతమని వ్యాఖ్య
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ అధికారానికి, రాజకీయాలకు అతీతం అని నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు. బీజేపీ భోపాల్ స్థానం అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.. గాంధీజీ హంతకుడు నాథూరామ్ గాడ్సే దేశభక్తుడని ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో సత్యార్థి స్పందించారు. నాడు గాంధీజీని గాడ్సే హత్య చేశాడు. కానీ ఈనాడు ప్రజ్ఞాసింగ్ వంటి వారు ఆయన ఆత్మతోపాటు అహింస, శాంతి, సహనాన్ని చంపేస్తున్నారు. ప్రజ్ఞాసింగ్‌ను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించాలి అని ట్వీట్ చేశారు. బీజేపీ తాత్కాలిక ప్రయోజనాలను పక్కనబెట్టి తక్షణం ఆమెను బయటకు పంపి రాజధర్మం పాటించాలన్నారు. గాడ్సే తొలి హిందూ ఉగ్రవాది అన్న మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హసన్ వ్యాఖ్యలపై ప్రజ్ఞాసింగ్ స్పందిస్తూ గాడ్సే దేశభక్తుడు. ఇక ముందు కూడా దేశభక్తుడిగానే ఉంటారు అని అన్నారు.

181
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles