అవిభక్త కవలలకు విడివిడి ఓటు హక్కు !


Sun,May 19, 2019 02:21 AM

Patna Conjoined Twins Now Hold Individual Voting Rights

-2015లో ఒకే ఓటరుగా గుర్తింపు
-ఇప్పుడు ఇద్దరికి గుర్తింపుకార్డులు
పాట్నా: తలలు అతుక్కొని పుట్టిన బీహార్ అవిభక్త కవలలు సబాహ్, ఫరాహ్ ఆదివారం జరిగే ఏడో విడుత ఎన్నికల్లో వేరువేరుగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పాట్నాలోని సమాన్‌పూర్ ప్రాంతానికి చెందిన వీళ్ళు.. 2015 ఎన్నికల్లో ఇద్దరూ కలిసి ఒకే ఓటేశారు. ఇద్దరి పేర్లు ఒకే ఓటరు కార్డుపై ముద్రించడం వల్ల ఇంకొకరు ఓటు వేసే హక్కును అప్పుడు కోల్పోయారు. అయితే, అధికారులు ఇప్పుడు ఇద్దరికీ వేరువేరు ఓటరు గుర్తింపు కార్డులను మంజూరుచేయడం వల్ల కవలలు వాళ్లకు నచ్చిన గుర్తుకు ఓటు వేయనున్నారు.

188
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles