25న విచారణకు హాజరు కావాలి


Tue,February 12, 2019 12:32 AM

Parl Panel Summons Twitter CEO to Appear Before it On February 25

-ట్విట్టర్ సీఈఓకు పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆదేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ అధినేత ఈనెల 25న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ అనురాగ్ ఠాకూర్ ఆదేశించారు. సోమవారం విచారణకు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ హాజరు కాకపోవడాన్ని కమిటీ సభ్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారని తెలిపారు. ట్విట్టర్ ఇండియా ప్రతినిధులు పార్లమెంటరీ స్థాయీ సంఘంతో సమావేశమయ్యేందుకు వచ్చినా వారిని చర్చలకు ఆహ్వానించలేదని సమాచారం. ఇంతకుముందు సోమవారం విచారణకు హాజరుకావాలని స్థాయీసంఘం ట్విట్టర్ సీఈఓను ఆదేశించింది. కానీ తక్కువ సమయంలో తమ సీఈఓ, ఇతర అగ్రశ్రేణి అధికారులు హాజరులేరని శనివారం ట్విట్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం సమావేశానికి ట్విట్టర్ సీఈఓ డుమ్మా కొట్టారు. దీంతో మరో అవకాశం ఇస్తూ ఈ నెల 25న హాజరుకావాలని ఆదేశించారు.

96
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles