ఐదేండ్లు సీఎంగా కుమారస్వామిపై చర్చించలేదు


Fri,May 25, 2018 01:26 AM

Parameshwara unsure if Kumaraswamy will finish 5 year term as Karnataka CM

-విధి విధానాలు చర్చించాక నిర్ణయం
-కర్ణాటక డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర వెల్లడి
Kumaraswamy
బెంగళూరు, మే 24: కర్ణాటక సీఎంగా ఐదేండ్లపాటూ తానే కొనసాగుతానని, ఆ పదవిని కాంగ్రెస్‌తో పంచుకునే ఉద్దేశమే లేదని కుమారస్వామి చెబుతుంటే.. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేత పరమేశ్వర మాత్రం భిన్న స్వరాన్ని వినిపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంగా కుమారస్వామి ఐదేండ్లపాటు కొనసాగుతారా అన్న ప్రశ్నకు ఆ అంశానికి సంబంధించిన విధివిధానాలపై కాంగ్రెస్-జేడీయూ ఇంకా చర్చలు జరుపలేదని చెప్పారు. ఈ విషయంలో ఇరుపార్టీల మధ్య ఇంకా బేరసారాలకు అవకాశం ఉందన్న రీతిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో విశ్వాసపరీక్షను ఎదుర్కోనున్న తరుణంలో పరమేశ్వర ఈ విధంగా వ్యాఖ్యానించటం విశేషం. ఏయే మంత్రిత్వ శాఖలు ఎవరికివ్వాలన్నా విషయంపైనా ఇంకా చర్చలు జరుగలేదని ఆయన చెప్పారు. తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంపై పార్టీలో విభేదాలు ఉన్నాయన్న వార్తలు కేవలం మీడియాలోనే వస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం, డిప్యూటీ సీఎంలయ్యే సామర్థ్యం గల నేతలకు కొదవ లేదని.. అయితే, ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఎమ్మెల్యేలతో విడిగా సమావేశమయ్యారన్న ప్రశ్నపై పరమేశ్వర స్పందిస్తూ ఎమ్మెల్యేలందరం ఐక్యంగానే ఉన్నాం. విశ్వాస పరీక్షలో మేం నెగ్గుతాం అని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తన కొనసాగింపు విషయమై అధిష్ఠానం నుంచి ఎటువంటి సమాచారం లేదని, ఆ పదవిలో డీకే శివకుమార్‌ను నియమిస్తే తాను చాలా సంతోషిస్తానన్నారు.

1604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles