జైపూర్ జైలులో పాక్ ఖైదీ హత్య


Thu,February 21, 2019 01:20 AM

Pakistani Prisoner Killed In Jaipur Jail

-టీవీ సౌండ్ విషయంలో గొడవ.. బండరాయితో కొట్టి చంపిన తోటి ఖైదీలు
జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్ సెంట్రల్ జైలులో పాకిస్థాన్‌కు చెందిన ఖైదీ షాకిర్ ఉల్లాను తోటి ఖైదీలు ముగ్గురు కొట్టి చంపారు. ఈ నలుగురు కలిసి జైలులో టీవీ చూస్తుండగా సౌండ్ విషయంలో గొడవ జరిగింది. దీంతో ముగ్గురు ఖైదీలు కలిసి పెద్ద బండరాయితో షాకిర్ తలపై బాదారు. తీవ్ర రక్తస్రావం అయిన అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేరంపై షాకిర్‌ను 2011లో పోలీసులు అరెస్టు చేశారు. 2017లో కోర్టు అతడికి జీవితకారాగార శిక్ష విధించింది.

829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles