పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారత్‌తో చర్చలు


Mon,April 15, 2019 01:47 AM

Pakistan hopes to re engage with India through structured dialogue post elections

-ఇరుదేశాల మధ్య నిరంతర సంప్రదింపులు అవసరం
-పాకిస్థాన్ హై కమిషనర్ సోహైల్ మహమూద్ వెల్లడి

న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం ప్రపంచదేశాల ముందు ఒంటరైపోయిన పాకిస్థాన్.. మెళ్లిగా దిగివస్తున్నది. రెండు నెలలుగా కయ్యానికి కాలుదువుతున్న దాయాది దేశం ఒక్కసారిగా శాంతిరాగం అందుకున్నది. లోక్‌సభ ఎన్నికల తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య మళ్లీ చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్టు పాకిస్థాన్ హైకమిషనర్ సోహైల్ మహమూద్ పేర్కొన్నా రు. రెండుదేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించాలంటే దౌత్యం, చర్చలే ఉత్తమ మార్గమని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ఫలవంతమైన చర్చలు జరిగినప్పుడే ఉపఖండ ప్రాంతంలో శాంతి, సుస్థిరత ఏర్పడుతుందని చెప్పారు. నిరంతర సంప్రదింపులు, ప్రణాళికాబద్ధమైన చర్చలతోనే దాయాది దేశాల మధ్య ప్రతిష్టంభన తొలుగుతుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. భార త ప్రభుత్వానికి పాకిస్థాన్‌పై ఉన్న అభిప్రాయంపై పునరాలోచించాలని కోరారు. ఇరు దేశాల శ్రేయ స్సుకు శాంతి, రక్షణ అంశాల్లో సహకరించుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. సిక్కుల పవిత్ర స్థలమైన గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను భారత్‌తో కలిపే కర్తార్‌పూర్ కారిడార్‌కు సంబంధించి పాకిస్థాన్ భూభాగంలో మౌలిక వసతుల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ఏడాది నవంబర్‌లోగా విధివిధానాలు ఖరారవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఫిబ్రవరిలో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జైషే ఉగ్రవాదులు బాం బుదాడి చేసిన అనంతరం భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పాక్ ప్రపంచదేశాల ముందు దోషిగా నిలిచింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో కొన్నాళ్లుగా పాకిస్థాన్ మెత్తబడుతున్నది.

మరో 100 మంది జాలర్లు విడుదల
పాకిస్థాన్ మరో 100 మంది జాలర్లను శనివారం విడుదల చేసింది. సత్‌ప్రవర్తన కారణంగా వారిని విడుదల చేస్తున్నట్టు చెప్పింది.

238
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles