పాక్‘బాబర్ ’.. అదో గ్రాఫిక్!Wed,January 11, 2017 01:42 AM

babur-missile
న్యూఢిల్లీ: బాబర్-3 క్షిపణిని పరీక్షించామని పాకిస్థాన్ పేర్కొన్న విషయం అబద్ధమని భారత నావికాదళం అధికారులు చెప్పారు. ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని పాకిస్థాన్ ఆర్మీ మీడియా విభాగం సోమవారం ట్విట్టర్‌లో వీడి యో పోస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన భారత నావికాదళం అధికారులు.. పాకిస్థాన్ బాబర్-3 క్షిపణిని పరీక్షించలేదని, పూర్తిగా అసత్య ప్రచారాన్ని చేసిందని తెలిపారు. రక్షణ శాఖ, శాటిలైట్ రంగ నిపుణులు ఆ వీడియోని విశ్లేషించారని, ఆ వీడియో అంతా కల్పితమని చెప్పారు. క్షిపణిని పరీక్షించినట్టు కం ప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించారని పేర్కొన్నారు. ఆ వీడియోలో వింతగా రెండు క్షిపణిలు కనిపిస్తున్నాయని, ఒకటి బూడిద రంగు, మరొకటి నారింజ రంగులో ఉన్నాయని చెప్పారు. దీనిని బట్టి పాకిస్థాన్ అసలు క్షిపణిని పరిక్షించలేదన్న విషయం స్పష్టమవుతున్నదని వివరించారు.

947
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS