ఎల్వోసీ వెంట ఉగ్ర శిబిరాలు

Thu,October 10, 2019 03:05 AM

- మళ్లీ ప్రారంభించిన పాకిస్థాన్‌


న్యూఢిల్లీ, అక్టోబర్‌ 9: నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట పాకిస్థాన్‌ కనీసం 20 ఉగ్రవాద శిక్షణ శిబిరాలను, మరో 20 ల్యాంచ్‌ప్యాడ్‌ (చొరబాట్లకు సహకరించే కేంద్రం)లను మళ్లీ ప్రారంభించిందని అధికారులు తెలిపారు. ఒక్కో ఉగ్రవాద శిబిరం, ఒక్కో చొరబాటు కేంద్రంలో కనీసం 50 మంది ఉగ్రవాదులు ఉన్నారని పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ బస్సుపై ఉగ్ర దాడి అనంతరం భారత వాయుసేన పాక్‌లోని బాలాకోట్‌ ఉగ్ర శిబిరంపై ప్రతీకార దాడి చేసిన నేపథ్యంలో సరిహద్దు వెంట ఉన్న పలు ఉగ్రవాద క్యాంప్‌లు, చొరబాటు కేంద్రాలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్‌ సంస్థలు భారత్‌లో ఉగ్రదాడులకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. భద్రతా దళాలు సదా అప్రమత్తంగా ఉంటూ నిఘాను ముమ్మరంగా కొనసాగిస్తున్నప్పటికీ గత కొన్ని వారాలలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. జమ్ముకశ్మీర్‌లో 200 నుంచి 300 వరకు ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉన్నట్టు ఆ రాష్ట్ర డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ తెలిపారు.

642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles