పటాకులు కాల్చంThu,October 19, 2017 02:02 AM

-87 శాతం మంది ఢిల్లీ వాసుల అభిప్రాయం
-సుప్రీంకోర్టు నిర్ణయానికి మద్దతు
Diya
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఢిల్లీలో పటాకుల విక్రయాలపై సుప్రీంకోర్టు విధించిన నిషేధానికి అక్కడి ప్రజలు మద్దతు తెలిపారు. దీపావళి సందర్భంగా కాలుష్యం నివారణకు తాముకూడా కృషి చేస్తామని, పటాకులు కాల్చబోమని తేల్చి చెప్పారు. 4,600 మందితో నిర్వహించిన సర్వేలో కేవలం ఐదు శాతం మంది.. తాము ఇప్పటికే కొనుగోలుచేసిన పటాకులు కాల్చి దీపావళి చేసుకుంటామని చెప్పారు. ఎనిమిది శాతం మంది పౌరులు అక్రమంగా పటాకులు కొనుగోలు చేసి ఎలా కాల్చాలో తెలుసునని పేర్కొనడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశిత భద్రతా ప్రమాణాల స్థాయిని దాటి అంతర్జాతీయంగా కాలుష్య కాసారంగా మారిన నగరాల్లో ఢిల్లీ ఒకటి. ఈ నేపథ్యంలో లోకల్ సర్వే సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పాల్గొన్న పౌరులు పటాకుల కాల్చడాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకున్నామని, దానికి కట్టుబడి ఉంటామని వివరించారు.దీపావళి సమయంలో ఢిల్లీలో వాయు కాలుష్యం 10 రెట్లకు పెరుగుతుంది. ఇక గుర్గావ్ సిటీ పరిధిలో 1637 మందిని సర్వే చేయగా 72 శాతం మంది పటాకులు కాల్చబోమని చెప్పారు. 18 శాతం మంది కాల్చాలని ఉన్నా అవి ఎలా దొరకుతాయో తెలియదన్నారు. ఐదు శాతం మంది ఇప్పటికే పటాకులు కొన్నామని, వాటిని కాలుస్తామన్నారు. మరో ఐదు శాతం మంది ఎలా పటాకులు తెచ్చుకోవాలో తెలుసునని చెప్పారు

149

More News

VIRAL NEWS