నాన్న గుర్తుకొచ్చారు


Thu,February 21, 2019 01:27 AM

Our father also met same fate we understand your pain

-జవాన్‌కు నివాళి అర్పిస్తూ రాహుల్ భావోద్వేగం
-సోదరి ప్రియాంకతో కలిసి యూపీలో జవాన్ కుటుంబం పరామర్శ

లక్నో: మా నాన్న గుర్తుకొచ్చారు.. అంటూ అమర జవాన్ కుటుంబాన్ని ఓదారుస్తున్న క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. బుధవారం యూపీలోని శామ్లి జిల్లాలో సీఆర్పీఎఫ్ అమర జవాన్ అమిత్‌కుమార్ కోరి సంతాప కార్యక్రమం జరిగింది. ఇందులో రాహుల్, ఆయన సోదరి, తూర్పు యూపీ ఇన్‌చార్జి ప్రియాంక గాంధీ, పశ్చిమ యూపీ ఇంచార్జి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొని అమిత్‌కు ఘన నివాళులు అర్పించారు. కన్నీటిపర్యంతమవుతున్న జవాన్ కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. మా నాన్న (మాజీ ప్రధాని రాజీవ్)ని కూడా ఇలాగే కోల్పోయామని నా సోదరి చెప్పింది. మీ గుండెల్లోని బాధను మేం అర్థం చేసుకోగలం. మేం కొన్ని నిమిషాలపాటు మీతో కూర్చుని మీ బాధను పంచుకోవాలని ఇక్కడికి వచ్చాం అని జవాన్ కుటుంబసభ్యులను రాహుల్ ఓదార్చారు. తండ్రిని గుర్తుకు చేసుకున్న క్రమంలో రాహుల్ భావోద్వేగానికి గురయ్యారు.

350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles