ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏలో ధీమా


Wed,May 22, 2019 01:32 AM

Our Alliance Represents Indias Diversity Modi Thanks NDA Family for Support After Dinner Meet

- మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
- ఎన్డీఏ పక్షాలకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విందు


న్యూఢిల్లీ, మే 21: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో అధికార పక్షంలో ఉత్సాహం ఉరకలేస్తున్నది. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి రెండు రోజుల ముందు మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్డీఏ పక్షాల నేతలకు విందునివ్వడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అంతకుముందు బీజేపీ కేంద్ర కార్యాలయంలో అబర్ మిలాన్ (ధన్యవాదాలు తెలిపేందుకు) జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ.. సహచర మంత్రులను ఒక్కొక్కరిని కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. క్యాబినెట్ సమావేశంలోనూ, ఎన్డీయే పక్షాల విందు సమావేశంలోనూ ఫలితాల వెల్లడి తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తున్నది. కాగా, మంత్రులతో ప్రధాని మోదీ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారాన్ని ఒక తీర్థయాత్రలా భావించానని చెప్పారు.

ఈవీఎంలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో ప్రజలతో కలిసి పార్టీ పోరాడిందన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. గత ఐదేండ్లలో చెప్పుకోదగిన విజయాలు సాధించినందుకు, కష్టపడి పని చేసిన మోదీ సర్కార్ టీంకు అభినందనలు. ప్రధాని మోదీ సారథ్యంలో నవ్య భారతం నిర్మాణం దిశగా ముందడుగు వేద్దాం అని పేర్కొన్నారు. దేశానికి ఐదేండ్లు సేవ చేసినందుకు మంత్రులకు ధన్యవాదాలు తెలిపేందుకే ఈ సమావేశం జరిగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles