వ్యూహాలకు పదును


Wed,May 22, 2019 01:37 AM

Oppn leaders meet move EC seeking VVPAT verification with EVMs

- ఢిల్లీలో విపక్ష నేతల భేటీ
- హాజరుకాని అగ్రనేతలు


న్యూఢిల్లీ, మే 21: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపులు జరుపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో డీలాపడిపోయిన విపక్ష శిబిరం మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. 22 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి రాహుల్‌గాంధీ, మమతాబెనర్జీ, మాయావతి, అఖిలేశ్‌యాదవ్, శరద్‌యాదవ్, తేజస్వియాదవ్, కుమారస్వామి వంటి ముఖ్యనేతలు హాజరుకాకుండా వారి ప్రతినిధులను పంపడం గమనార్హం. ఎన్నికల ఫలితాలను బట్టి తదుపరి కార్యాచరణ రూపొందించేందుకు నిరంతరం సంప్రదింపులు జరుపాలని విపక్షనేతలు సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవ్‌గౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో సంప్రదింపులు జరిపేందుకు చంద్రబాబు బెంగళూరుకు పయనమయ్యారు. ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహంపై కేజ్రీవాల్.. అఖిలేశ్‌యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles