‘బహిరంగ విద్వేషం’ కలవరపెడుతున్నది!

Sun,October 13, 2019 02:38 AM

మూకదాడులపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: నసీరుద్దీన్ షా
ముంబై: మూకదాడుల ఘటనలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా చెప్పారు. సమాజంలో నెలకొన్న బహిరంగ విద్వేషం కలవరపెడుతున్నదని అన్నారు. దేశంలో పోలీసు హత్య కంటే గోహత్యలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని గతేడాది చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శనివారం ఇండియా ఫిల్మ్ ప్రాజెక్ట్ సందర్భంగా నటుడు ఆనంద్ తివారీతో ఆయన సంభాషించారు. ప్రధానికి లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశ ద్రోహం కేసు నమోదుచేయడాన్ని ఖండించిన 180 మంది కల్చరల్ కమ్యూనిటీ సభ్యుల్లో నసీరుద్దీన్ ఒకరు.

137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles