పోలింగ్ కేంద్రంలో ఉల్లిగడ్డలు!


Sun,May 19, 2019 02:22 AM

Onions come in rescue of polling officers to beat the heat in MP Jhabua

-వడదెబ్బ బారిన పడకుండా మధ్యప్రదేశ్‌లో పోలింగ్ సిబ్బందికి సరఫరా
జబువా: దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి ముగుస్తున్నప్పటికీ, భానుడి ప్రతాపం మాత్రం తగ్గడం లేదు. దీంతో ఎన్నికల సంఘం పోలింగ్‌లో పాల్గొనే సిబ్బంది పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. పోలింగ్ సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు మధ్యప్రదేశ్‌లోని జబువా జిల్లా ఎన్నికల అధికారి ప్రబాల్ సిపాహా వినూత్న ఉపాయానికి అంకురార్పణ చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల వంటి ఎన్నికల పరికరాలతో పాటు ఉల్లిపాయలను కూడా ఆదివారం జరిగే పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తమ వెంట తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు. ఉల్లిపాయలు దగ్గరుంటే చల్లదనం ఉంటుందని, డీ హైడ్రేషన్ సమస్య ఉండదన్న ఉద్దేశంతో ఆయన ఈ ఆదేశాలిచ్చారు. దీంతో 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోన్న జబువా జిల్లాలో.. 981 పోలింగ్ కేంద్రాల సిబ్బంది తమ వెంట ఉల్లిగడ్డల సంచులను తీసుకెళ్లారు.

583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles