స్వలింగ సంపర్కాన్ని సైన్యంలో అనుమతించం


Fri,January 11, 2019 02:37 AM

On gay sex in Army chief Bipin Rawat says such actions are unacceptable

-ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైన్యంలో అనుమతించబోమని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. గురువారం ఆయన వార్షిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అలాంటి విషయంపై (స్వలింగ సంపర్కంపై) సైన్యంలో నిషేధం ఉన్నదని తెలిపారు. అయినప్పటికీ చట్టానికంటే సైన్యం గొప్పది కాదని చెప్పారు. వివాహేతర శృంగారంపై సుప్రీకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా తాము సైన్యంలో అనుమతించమని, సైన్యానికి ఓ సంప్రదాయమంటూ ఉన్నదని, మొత్తం సైన్యం అంతా ఒక కుటుంబం లాంటిందని పేర్కొన్నారు. తాము ఆర్మీ చట్టం ప్రకారం ముందుకు సాగుతున్నామని తెలిపారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ, ఒకవేళ నేరంగా పరిగణిస్తే సమానత్వపు హక్కును ఉల్లంఘించడమే అవుతుందని గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే.

286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles