విశాఖలో ఓమెగా సేవలు

Mon,November 11, 2019 01:39 AM

- ప్రారంభించిన ఆ హాస్పిటల్స్‌ సీఈవో పీ శ్రీధర్‌


విశాఖ: ఏపీలోని విశాఖపట్నంలో ఓమెగా హాస్పిటల్‌ సేవలు ప్రారంభమయ్యాయి. విశాఖ రూరల్‌ మండలం చిన్నగాదిలిలోని హనుమంతవాకలో 110 పడకల ఓమెగా హాస్పిటల్‌ను ఆదివారం ఆ హాస్పిటల్స్‌ సీఈవో పీ శ్రీధర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఓమెగా సేవలను మరింత అభివృద్ధిపరుస్తూనే.. ఏపీలోని కర్నూలు, గుంటూరులో ఇప్పటికే హాస్పిటళ్లను ప్రారంభించినట్టు తెలిపారు. తాజాగా విశాఖలో ప్రారంభించిన హాస్పిటల్‌ ద్వారా ఉత్తరాంధ్రవాసులకే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల ప్రజలకు సైతం వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఓమెగా హాస్పిటల్స్‌ విశాఖ ఎండీ డాక్టర్‌ బీ రవిశంకర్‌ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి సమగ్రమైన క్యాన్సర్‌ హాస్పిటల్‌గా ఓమెగా నిలుస్తుందని చెప్పారు. గతంలో నాణ్యమైన క్యాన్సర్‌ చికిత్స కోసం రోగులు హైదరాబాద్‌ లేదా విజయవాడ వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం విశాఖలోనే అత్యాధునిక టెక్నాలజీతో వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. సమావేశంలో సర్జికల్‌ ఆంకాలజిస్టు డాక్టర్‌ వీరపనేని ప్రదీప్‌, డాక్టర్‌ చరణ్‌జిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

66
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles