మహాకూటమిలో చేరబోము


Thu,January 10, 2019 03:18 AM

Odisha CM naveen patnaik says no to both NDA and Mahakutami

-కాంగ్రెస్, బీజేపీతో సమదూరాన్ని కొనసాగిస్తాం
-ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ స్పష్టీకరణ

భువనేశ్వర్, జనవరి 9: లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాలు ఏర్పాటు చేస్తున్న మహాకూటమిలో బిజూ జనతాదళ్ (బీజేడీ) చేరబోదని, బీజేపీతో గానీ కాంగ్రెస్‌తో గానీ బీజేడీ పొత్తు పెట్టుకోబోదని ఆ పార్టీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తేల్చి చెప్పారు. భువనేశ్వర్‌లో బుధవారం ఆయన ఓ సమావేశంలో పాల్గొన్న తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌తో సమదూరాన్ని పాటించాలన్న విధానాన్ని బీజేడీ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీతో పోరాడేందుకు పలు బీజేపీ యేతర పక్షాలు మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో నవీన్ పట్నాయక్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మహాకూటమిలో బీజేడీ చేరికపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం అవసరమని మంగళవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా చెప్పిన నవీన్ పట్నాయక్.. ఆ మరుసటి రోజే మహాకూటమిలో చేరేది లేదని ప్రకటించడం గమనార్హం. దశాబ్ద కాలానికిపైగా బీజేపీతో పొత్తు కొనసాగించడంతోపాటు 2000 నుంచి 2009 వరకు ఆ పార్టీతో కలిసి ఒడిశాలో అధికారాన్ని పంచుకున్న బీజేడీ.. 2009లో ఎన్నికల సందర్భంగా కమలనాథులతో సంబంధాలను తెంచుకున్న విషయం విదితమే. అప్పటి నుంచి ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తూ బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరాన్ని పాటిస్తున్నది.

393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles